తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

కలం, వెబ్​ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పలువురు సీనియర్​ ఐఏఎస్​ అధికారులను బదిలీ (IAS Transfers) చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు బదిలీ చేసి మెట్రోపాలిటన్​ ఏరియా, అర్బన్​ డెవలప్​ మెంట్​ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో ఈవీ నరసింహారెడ్డిని బదిలీ చేయడంతో పాటు.. మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా ఉన్న బి. అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్‌బీ జాయింట్ ఎండీగా ఉన్న మయాంక్ మిత్తల్ కు జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కె. చంద్రకళ ట్రాన్స్​ ఫర్​ అయ్యారు.

అలాగే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. బెల్లంపల్లి సబ్-కలెక్టర్‌గా ఉన్న మనోజ్ ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) జాయింట్ ఎండీగా ట్రాన్స్​ ఫర్​ చేశారు. విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా వరంగల్ స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న పి.రామును నియమించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>