ఇన్‌స్టాలో నకిలీ డాక్టర్ అవతారం..రూ.10 లక్షలకు టోకరా

కలం, వెబ్ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్‌లో ధనవంతుడైన డాక్టర్‌గా పరిచయం చేసుకుని ఓ వ్యక్తిని మోసం (Instagram Doctor Fraud) చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకున్న నిందితులు, బాధితుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సుమారు రూ.10.05 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పథకం ప్రకారం బాధితుడికి సంబంధించిన ఓటీపీలను దుర్వినియోగం చేసి, అతడి పేరు మీద రుణం పొందినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ మోసానికి సంబంధించి ప్రధాన నిందితుడి తల్లితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 20 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు వెల్లడించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>