చలో ఢిల్లీకి ప్రజా సంఘాల మద్దతు కోరిన పౌరహక్కుల సంఘం

కలం, హనుమకొండ : దేశంలో ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 10న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పౌరహక్కుల సంఘం (Civil Rights Committee) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. శనివారం హనుమకొండలోని కాళోజీ జంక్షన్‌లో సంఘం ప్రతినిధులు పోస్టర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా 16 హక్కుల సంఘాలతో కూడిన ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (సీడీఆర్‌ఓ) ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపింది.

ఉపా చట్టాన్ని రద్దు చేసి, ఆ చట్టం కింద నిర్బంధంలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని, ప్రజల పౌరసత్వ హక్కులకు భంగం కలిగించే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో పదిమంది ఆదివాసీలకు విధించిన ఉరిశిక్షలను రద్దు చేయాలని కోరింది. ఈ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు, సహాయ కార్యదర్శి పి. రమేష్‌చందర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బోళ్ల జయంత్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఎస్‌. పాణి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>