పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి: సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాల కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) స్పష్టం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మండలానికి మంజూరైన 59 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు ప్రొసీడింగ్స్‌ను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం చిరకాల స్వప్నమని, ఆ కలను నిజం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని, విడతల వారీగా ఇళ్ల మంజూరు ప్రక్రియను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే (MLA Kumbam) పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. తమ చిరకాల సొంతింటి కల నెరవేరబోతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>