ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: సీపీ వార్నింగ్

కలం, కరీంనగర్: వాహనాలకు అమర్చి తీవ్రమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 270 మోడిఫైడ్ సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Goush Alam) సమక్షంలో వీటిని రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా నాశనం చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్న వాహనదారుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. అలాగే, ప్రజలు ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వాట్సాప్ ఫోన్ నంబర్ 9381919112 కు పంపవచ్చని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ యాదగిరిస్వామి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్, ఎస్సైలు హనుమంతరావు, రజాక్, ఏఎస్సై మధుతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>