డిసెంబర్ 4, 5 తేదీల్లో కరీంనగర్‌లో రక్తదాన శిబిరం

కలం, కరీంనగర్ : ఒకరి ప్రాణం నిలబెట్టేందుకు మనం చేసే చిన్న సాయం.. మరొక కుటుంబంలో వెలుగులు నింపుతుంది. ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలనే సంకల్పంతో ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరం (Blood Donation Camp) నిర్వహించనున్నట్లు సంస్థ ఎస్‌బీయూ హెడ్ సబ్బిడి విజయ్ తెలిపారు. ఇండియన్ రెడ్‌ క్రాస్ సొసైటీ కరీంనగర్ శాఖ సహకారంతో డిసెంబర్ 4,5 తేదీల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌ లోని కమాన్ నుంచి బస్టాండ్ వెళ్లే మార్గంలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ పైన ఉన్న ఇఫ్కో టోకియో కార్యాలయం నాలుగో అంతస్తులో శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

రక్తం అవసరమైన సమయంలో సకాలంలో అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్త దానానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్త దాతలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొనే దాతలు ముందురోజు, శిబిరం నిర్వహించే రోజున మద్యపానానికి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. మీరు చేసే రక్తదానం.. మరొకరికి పునర్జన్మ కావచ్చు. ఒక్క అడుగు ముందుకేయండి.. ప్రాణాలను కాపాడే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కండి అని ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>