అక్రమ ఇసుక తవ్వకాలపై కలెక్టర్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు (Illegal Sand Mining), రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సంబంధిత జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

గ్రామాల్లో అనధికార ఇసుక టెండర్లు నిర్వహించవద్దని సూచించారు. అక్రమ తవ్వకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాలను జప్తు చేసి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆక్రమణలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>