ఎమ్మెల్యే సొంత పంచాయతీలోనే నిర్మాణ పనులు డొల్ల

కలం, దమ్మ పేట: దమ్మపేట (Dammapeta)మండలంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో చేపడుతున్న పనుల్లో నాణ్యత ప్రశ్నార్ధకంగా మారింది మండల పరిధిలోని రెడ్యాలపాడు ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది గిరిజన గ్రామంలో విద్యార్ధుల భద్రత కోసం నిర్మిస్తున్న ప్రహరీగోడ నిర్మాణమే ప్రశ్నార్ధకంగా మారటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.8 లక్షల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ నిర్మాణ పనుల్లో కాలువల నుంచి తవ్విన ఇసుకను వినియోగిస్తు నాణ్యతకు పాతర వేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన నిర్మాణ సామగ్రి ఉపయోగించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ స్థానికంగా ఉండే కాలువలు వాగుల నుండి తవ్వి తీసిన నాసిరకం ఇసుకతో పనులు చేపట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అనుచరుడు కావటంతో కనుసన్నల్లోనే అధికారుల పనితీరు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఎమ్మెల్యే సొంత పంచాయతీలోనే ఇలాంటి నాసిరకం పనులు చేస్తుండటం ఎమ్మేల్యేకు అప్రతిష్ఠ మూటకట్టుకోవాల్సివస్తుంది..

నేను పర్యవేక్షిస్తూనే ఉన్నా.. జే.ఈ ఝుంకీలాల్‌.

ఇదే విషయమై పంచాయతీరాజ్ జేఈ ఝుంకీలాల్‌ను ఫోన్‌లో సంప్రదించగా, తాను ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఓ అధికారి నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రహరీగోడ నిర్మాణంలో ఇంతటి నాసిరకం ఇసుక వినియోగంపై అధికారి పనితీరుపై అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. మండల స్థాయి అధికారి పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పనులు ఎలా కొనసాగుతున్నాయన్నది స్థానికుల ప్రశ్న. ముఖ్యంగా గిరిజన గ్రామం కావడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడికి సంబంధించిన కాంట్రాక్టు కావడం వల్లే పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి నాణ్యత లేనిపనులపై ఉన్నతాధికారులు విచారణ చేపడతారా లేక తమకేమీ పట్టనట్టు వదిలేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>