మధురైలో సంబరాలు.. కొండపై భారీ భద్రత

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు మధురైలోని తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై దీపం వెలిగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో భక్తులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అరుల్‌మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. అదే సమయంలో కోర్టు ఆదేశాలతో సీఆర్పీఎఫ్ బలగాలు కొండను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీపం వెలిగించే దీపతూణ్ రాతి స్తంభం వద్ద పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయుధ బలగాలను కొండ చుట్టూ మోహరించిన సీఆర్పీఎఫ్ అధికారులు.. పైకి ఎవరు రాకుండా అడ్డుకున్నారు. వారిపై భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. సాయంత్రం 5 గంటలకు కొండపై దీపం వెలగనుంది.

ఇద్దరు జడ్జిల పర్యవేక్షణలో..

మాజీ హై కోర్టు జడ్జిలు వైద్యనాథన్, పార్థిబన్ తిరుప్పరంకుండ్రం కొండ వద్దకు చేరుకున్నారు. దీపం వెలిగించే కార్యక్రమంతో పాటు తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఆలయ నిర్వహణ బాధ్యతలను వీరే చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామి వారికి పూజలు చేసి.. ఏర్పాట్లను పరిశీలించారు. సీఆర్పీఎఫ్ అధికారుల భద్రతపై పర్యవేక్షించారు. దీపం వెలిగించే స్తంభానికి కొద్ది దూరంలోనే ఉన్న సికిందర్ బాద్ షా దర్గా వద్దకు కూడా ముస్లిం భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, భద్రతను కట్టుదిట్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>