సముద్ర రక్షణే దేశ రక్షణ.. నేవీ పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాష్ట్రపతి

కలం, వెబ్ డెస్క్ : కేరళలోని ఎళిమల ఇండియన్ నేవల్ అకాడమీ (Indian Naval Academy) లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక ద్వారా 427 మంది నూతన యువ అధికారులు భారత నౌకాదళంలోకి అడుగుపెట్టారు. వీరిలో 69 మంది మహిళా క్యాడెట్లు, 18 మంది విదేశీ శిక్షణార్థులు ఉండటం విశేషం.

ఈ సందర్భంగా క్యాడెట్లను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ, పరస్పర అనుసంధాన ప్రపంచంలో సముద్ర రంగ ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందని, సముద్ర మార్గాల భద్రత దేశ ఆర్థిక శ్రేయస్సుతో పాటు ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడి ఉందని ఆమె స్పష్టం చేశారు. నౌకల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం కలిగినా నిత్యావసరాల సరఫరా, ఖర్చులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రాల ద్వారా భారత రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయని రాష్ట్రపతి కొనియాడారు. కొత్త సాంకేతికతల రాకతో యుద్ధ స్వరూపం, సముద్ర భద్రతా సవాళ్లు మారుతున్నాయని తెలిపారు. నూతన అధికారులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, నిజాయతీ, ధైర్యం, న్యాయబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>