ఆర్టీసీ ప్రయాణికులూ.. మీ సమస్యలు చెప్పండి!

కలం, నిర్మల్: ప్రయాణికుల సమస్యలు, సూచనలు, సలహాలు తెలుసుకునేందుకు నిర్మల్(Nirmal) ఆర్టీసీ డిపో పరిధిలో ఆదివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కల్పన శనివారం తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికులు బస్సుల రాకపోకల సమయాల్లో మార్పులు, అదనపు బస్సుల అవసరం, ఇతర సమస్యలు, సూచనలు ఉంటే 9959226003 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>