హోటల్ గదిలో గుంటూరు యువకుడి మృతి.. అసలేం జరిగింది?

కలం, వెబ్ డెస్క్: హోటర్ గదిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ (Ghatkesar) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని ఓ ప్రైవేట్ థియేటర్‌లో కోట శ్రీరామ్ (29) అనే యువకుడు కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శ్రీరామ్ థియేటర్ నగదు, మొబైల్ తీసుకెళ్లడంతో పాటు ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన అకౌంట్‌లోకి బదిలీ చేసుకున్నట్లు యజమాని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతొ వారు శ్రీరామ్ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీరామ్ 27వ తేదీన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని చౌదరిగూడలో లివింగ్ ట్రీ ఓయూ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి వీడియో సందేశం పంపిన శ్రీరామ్, హోటల్ లొకేషన్ కూడా షేర్ చేశాడు. యజమాని హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో వారు గది వద్దకు వెళ్లి తలుపులు తట్టినా స్పందన రాలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా.. శ్రీరామ్ దుప్పటితో ఫ్యాన్‌‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>