కేపీహెచ్‌బీలో విషాదం.. కార్తిక దీపం అంటుకుని యువతి మృతి

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో విషాదం (KPHB Tragedy) చోటుచేసుకుంది. గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన సాయి వెంకట సింధు (18) అనే యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

కేపీహెచ్‌బీ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ వెస్ట్రన్ హిల్స్‌లో నివాసం ఉంటున్న సింధు ఒక బొటిక్ నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీ రాత్రి ఆమె తన షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటి గేటు వద్ద వెలిగించి ఉన్న కార్తీక దీపం ప్రమాదవశాత్తూ ఆమె చీరకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు శరీరమంతా వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన సింధు, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పండుగ వేళ కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>