కలం, సినిమా: రోహన్ రాయ్, అరుణ్ దేవ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’(Summer Holidays). శ్రీకర్ నాయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 6న థియేటర్లలో విడుదలైంది. బాల్యం, స్నేహం, చిన్ననాటి మధుర జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్పై ఈ మూవీని నిర్మించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించారు.
తండ్రి ఒత్తిడి, చదువులో ర్యాంకుల కోసం ఎదురయ్యే ఇబ్బందులతో బాధపడే రావూరి వెంకటేష్ అలియాస్ RV(అరుణ్ దేవ్)ని తల్లి సమ్మర్ హాలిడేస్కు అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ కాశి వెంకటేశ్వర్లు అలియాస్ KV(రోహాన్ ) పరిచయం అవుతాడు. ఎన్నో కష్టాలున్నా సంతోషంగా జీవించే KVతో RVకి స్నేహం ఏర్పడుతుంది. ఈ ఇద్దరి స్నేహం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వారి అనుభవాలు, కష్టాలు ఏమిటన్నదే ఈ సినిమా కథ.

