కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం(Simhachalam) శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయానికి భారీ స్వర్ణ కానుక సమర్పించారు. ఆలయంలోని ధ్వజస్తంభం పీఠానికి రూ.1.20 కోట్ల విలువైన బంగారు తాపడాన్ని CMR సంస్థల అధినేత మావూరి వెంకట రమణ సమర్పించారు. మొత్తం 509.600 గ్రాముల బంగారంతో ఈ స్వర్ణ తాపడాన్ని తయారు చేయించి స్వామివారికి కానుకగా అందజేశారు. గతంలో కూడా ధ్వజస్తంభానికి రూ.2.80 కోట్ల వ్యయంతో బంగారు తాపడాన్ని సమర్పించారు. రెండు కానుకలతో కలిపి సుమారు రూ.4 కోట్ల విలువైన బంగారు తాపడం చేయించారు. ఈ స్వర్ణ కానుక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

