భద్రాచలంలో ర్యాపిడో సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

​కలం, ఖమ్మం బ్యూరో : భక్తుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంలో ఇకపై తక్కువ ఖర్చుతో, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బైక్ ట్యాక్సీ సేవా సంస్థ ‘ర్యాపిడో’ (Rapido) భద్రాచలంలోకి అడుగుపెడుతూ తన సేవలను ప్రారంభించింది. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు (MLA Tellam Venkata Rao) ముఖ్య అతిథిగా హాజరై సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాపిడో నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

​అనంతరం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక గమ్యస్థానమైన భద్రాచలంలో ర్యాపిడో సేవలు అందుబాటులోకి రావడం దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో పాటు స్థానిక విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సమయం ఆదా కావడంతో పాటు, తక్కువ ఖర్చులోనే గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడానికి ఈ బైక్ ట్యాక్సీ సేవలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం అభినందనీయమని కొనియాడారు.

ర్యాపిడో సేవల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, స్వయం ఉపాధికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి పథంలో ఇలాంటి ఆధునిక సేవలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో ర్యాపిడో నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, స్థానిక యువకులు, రైడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>