హైద‌రాబాద్‌లో మ‌రో బాంబు బెదిరింపు క‌ల‌క‌లం!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో మ‌రోసారి బాంబు బెదిరింపులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇటీవ‌ల కాచీగూడ‌లో రైల్వే స్టేష‌న్‌, ఓ హోట‌ల్‌కు బాంబు బెదిరింపులు చేస్తూ ఈమెయిల్స్ రాగా.. తాజాగా పంజాగుట్ట‌లోని జీవీకే మాల్‌కు (Punjagutta GVK Mall) బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. మాల్‌లో బాంబు పెట్టామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌లు ఫోన్ కాల్‌లో చెప్పారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మాల్ మొత్తం బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు.

కొన్నేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ పెరిగిపోతున్నాయి. ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్ కూడా వీపీఎన్‌తో పంపిన‌ట్లు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇక జీవీకే మాల్ (Punjagutta GVK Mall) బాంబు బెదిరింపు నేప‌థ్యంలో స్థానికంగా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇది కూడా ఎవ‌రైనా ఆక‌తాయిలు చేసిన ప‌నేనా? దీని వెనుక ఎవ‌రున్నార‌న్న దానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపుల‌క సంబంధించి మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read : తాజ్ మహల్‌పై వానర‌సేన దండయాత్ర.. వీడియో వైరల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>