కార్తీక దీపోత్సవంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు అపర్ణ కు సత్కారం

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన కార్తీక దీపోత్సవ (Karthika Deepotsavam) కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు మేడారం అపర్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని, పవిత్రమైన మాసంలో ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని, సకల దోషాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అపర్ణను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోటగిరి శ్రీధర్, మూడారం గంగాధర్, రాజేందర్, జాదవ్ అనిత, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>