కలం, గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండలం ( Gudihathnoor BRS) ఎంఐఎం పార్టీ మండల ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల గౌడ్, మాజీ సర్పంచ్ రాము తదితరులు పాల్గొన్నారు.

