కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా జట్టులో మన ఇండియన్ నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary) స్టార్‌గా మెరిశాడు. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 28 బంతుల్లో 65 పరుగులతో చెలరేగాడు. నిఖిల్ చౌదరి 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. బ్రూక్, సామ్ కరన్ వికెట్లను కూల్చాడు.
188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 53/2 వద్ద తడబడింది. ఢిల్లీలో పుట్టిన నిఖిల్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీతో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. నిఖిల్ 18వ ఓవర్లో ఔటయ్యాక ఆసీస్ ఒత్తిడిలో పడింది. చివర్లో జాక్ ఎడ్వర్డ్స్ 11 బంతుల్లో 25 నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఆల్‌రౌండ్ షో చేసిన నిఖిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 2020లో ఆసీస్‌లో చిక్కుకుపోయిన నిఖిల్ అక్కడే స్థిరపడ్డాడు. దేశవాళీ క్రికెట్లో రాణించి ఇప్పుడు జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. తొలి మ్యాచ్‌తోనే ఆసీస్ ఆధిపత్యం మొదలైంది.

