కలం, స్పోర్ట్స్: బంగ్లాదేశ్‌కు దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ హసన్ మహమూద్ (Hasan Mahmud) కుడి మోచేతి గాయం కారణంగా టూర్ నుంచి తప్పుకున్నాడు. రెండో టెస్టుతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్లో బంగ్లా పేస్ బౌలింగ్ విభాగం అతడి సేవలను కోల్పోనుంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్టులో హసన్ 4 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే మోచేతి నొప్పితో మధ్యలోనే మైదానం వీడాడు. మూడో రోజు తిరిగి వచ్చినా, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు.
సెంచూరియన్‌లో సోమవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బంగ్లా ఇంకా అతడి స్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. జట్టులో ఉన్న షరీఫుల్ ఇస్లాం ప్రస్తుతం ప్రధాన పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. టెస్టుల తర్వాత డిసెంబర్ 1 నుంచి 7 వరకు మూడు వన్డేలు, డిసెంబర్ 10 నుంచి 13 వరకు మూడు టీ20లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నింటికీ హసన్ దూరం కావడంతో బంగ్లా బౌలింగ్ విభాగం కొత్త కూర్పుతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

