హైద‌రాబాద్‌లో ఏసీబీకి చిక్కిన‌ మ‌రో అవినీతి అధికారి

క‌లం, వెబ్‌డెస్క్‌: విద్యుత్ చౌర్యం కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. టీజీఎస్పీడీసీఎల్ గాంధీ నగర్ సెక్షన్ ఆఫీసులో సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ ఆనంద్‌ ఒక విద్యుత్ చౌర్యం కేసును మాఫీ చేసేందుకు బాధితుడిని రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం సంతోష్ ఫిర్యాదుదారుడి నివాసానికి వెళ్లాడు. అక్క‌డ‌ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>