కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా అదనపు కలెక్టర్‌గా పి. కృష్ణ(Krishna) బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అదనపు బాధ్యతలు అప్పగించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పగించిన బాధ్యతలను పూర్తి అంకితభావం, నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు.
జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి స్థానిక సంస్థలు ఎంతో కీలకమని, ఈ దిశగా మరింత సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీల పరిధిలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ సేవలను మెరుగుపరచడం, పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చెప్పారు.
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానిక సంస్థల పనితీరును పరిశీలించడంతో పాటు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు. జిల్లా (Jogulamba Gadwal) అభివృద్ధి లక్ష్యాల సాధనలో తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read : ధోనీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: జహీర్ ఖాన్
Follow Us On : WhatsApp

