తెలుగు సినిమాలపై మళ్లీ పైరసీ పంజా..!

కలం, వెబ్​ డెస్క్​: టాలీవుడ్​ సినిమా పరిశ్రమలో మరోసారి పైరసీ (Telugu Film Piracy) కలకలం రేపింది. కొత్తగా విడుదలైన నాలుగు తెలుగు సినిమాలు ఆన్​ లైన్​ లో లీక్ అయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా పైరసీకి గురయిందని ఫిల్మ్ ఛాంబర్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలు పైరసీ అయినట్లు గుర్తించారు.

కర్నూలులోని సిటీ స్క్వేర్​ మాల్​ లో ఉన్న థియేటర్​ లో దుండగులు మూడు సినిమాలను రహస్యంగా రికార్డ్​ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో లీక్​ చేసినట్లు తెలుస్తోంది. పైరసీపై ఫిల్మ్​ ఛాంబర్​ కు చెందిన యాంటి వీడియో పైరసీ సెల్​ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారు? ఆన్​ లైన్ లో అప్​ లోడ్​ చేసిన వారి వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>