ఉత్తమ నటుడిగా రణ్‌వీర్.. ‘ధురంధర్’కు అవార్డుల పంట!

కలం, సినిమా : ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 (Dadasaheb Phalke Awards) పురస్కారాల్లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’కు అవార్డుల పంట పండింది. శుక్రవారం ప్రకటించిన ఈ అవార్డుల జాబితాలో ‘ధురంధర్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. అంతేకాకుండా, ఇదే చిత్రానికి గానూ ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా, అక్షయ్ ఖన్నా ఉత్తమ విలన్‌గా, శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు.

మరోవైపు, మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘సయారా’ చిత్రంలో తన నటనతో మెప్పించిన అనీత్ పడ్డా ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకున్నారు. విమర్శకుల విభాగంలో ‘కాంతార: చాప్టర్ 1’ ఉత్తమ చిత్రంగా నిలవగా, ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్) పురస్కారాన్ని గెలుచుకున్నారు. సంగీత దిగ్గజం ఇళయరాజా, విలక్షణ నటుడు కమల్ హాసన్‌లకు వరుసగా సంగీత, చలనచిత్ర రంగాల్లో విశేష కృషి చేసినందుకు గానూ ప్రత్యేక పురస్కారాలు దక్కాయి. అంతర్జాతీయ విభాగంలో ప్రముఖ అమెరికన్ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ ‘ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక కాగా, ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>