ష‌ర్మిల కుమార్తె హ‌ల్దీ వేడుక‌.. ఫోటోలు వైర‌ల్!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. ష‌ర్మిల కుమార్తె అంజ‌లి రెడ్డి వివాహం డిసెంబ‌ర్ 5న జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గురువారం హ‌ల్దీ వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ష‌ర్మిల కుటుంబ స‌భ్యుల‌తో పాటు అతి త‌క్కువ మంది స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు. వైఎస్ విజ‌య‌మ్మ కూడా వేడుక‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ హ‌ల్దీ సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ హ‌ల్దీ వేడుక‌కు వైఎస్ జ‌గ‌న్ కుటుంబానికి ఇన్విటేష‌న్ ఉందా? లేదా? అన్న‌ది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ష‌ర్మిల‌, జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే ఆస్తి త‌గాదాలు ఉన్నాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక తాజాగా అంజ‌లి రెడ్డి పెళ్లితో మ‌రోసారి ఇవి తీవ్ర రూపం దాల్చాయి. ముందుగా ష‌ర్మిల అంజ‌లి పెళ్లిని య‌ల‌హంక‌లోని ఇంట్లో చేద్దామ‌ని భావించారు. అయితే జ‌గ‌న్ దీనికి నిరాక‌రించారు. ఆ త‌ర్వాత ష‌ర్మిల పెళ్లి వేదిక‌ను మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే య‌ల‌హంక ఇంట్లో పెళ్లి చేసుకోవ‌డం త‌న కుమార్తె కోరిక అని, ఆ కోరిక నెర‌వేర్చ‌లేక పోతున్నందుకు త‌ల్లిగా ఎంతో బాధ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. దీనికి కార‌ణం జ‌గ‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల త‌న కుమార్తె పెళ్లికి జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తారా? లేదా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>