కలం, అచ్చంపేట: ఈనెల 26న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నల్లమలలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సమాచారం తెలియడంతో నల్లమల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 6 దశాబ్దాల కాలంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న అప్పర్ ప్లాట్ ప్రజలకు రేవంత్ శుభవార్త అందిస్తారని ఆశలు పెట్టుకున్నారు. శ్రీ ఉమామహేశ్వర రిజర్వాయర్ పేరిట జరుగుతున్న పనులను ముమ్మరం చేయించి అప్పర్ ప్లాటుకు సాగును ఇచ్చే విధంగా సీఎం స్వయంగా చొరవ తీసుకునేవిధంగా మాట్లాడుతారని ఎదురుచూస్తున్నారు.
అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అనేక వనమూలికలను దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదిక కళాశాల ఏర్పాటు చేయాలని నల్లమల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఎంతోకాలంగా గుర్తింపు పొందిన దేశవ్యాప్తంగా 43 వ జాతిగా నల్లమల తూర్పుజాతి పొడ (నల్లమల మచ్చలగిత్త ) తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ గా ప్రకటించి దానికోసం 100 ఎకరాల్లో సిమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నల్లమల పర్యటనపై ఆసక్తి నెలకొంది.

