డ్రైవర్ నిద్రమత్తు.. అదుపుతప్పి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనేపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Anantapur Bus Accident) చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎఫ్‌ఆర్‌కే (FRK) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించాయి. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>