కలం, జోగులాంబ గద్వాల: అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జోగులాంబ గద్వాల జిల్లా రెండో మహాసభలు బుధవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రఘునాథ్‌రెడ్డి (Raghunath Reddy), ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ (Venkatesh) ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి. రాము, సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు సమక్షంలో ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం, విద్యా, ఉపాధి హక్కుల సాధనకు పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.

