జమానత్ బాండ్లతో కక్షిదారులకు ఊరట

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ కోర్టు పరిధిలోని న్యాయవాదుల ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా కోర్టులో జమానత్ కోసం డిపాజిట్ చేసే సదుపాయాన్ని(Bail Deposit Facility) న్యాయవాదులు, తద్వారా కక్షిదారులు వినియోగించుకోవాలని న్యాయవాదుల సహకార సంఘం చైర్మన్ గడ్డం లక్ష్మణ్ కోరారు. ఇటీవల ప్రారంభించిన ఈ సదుపాయంలో భాగంగా ఇద్దరి పేర్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ పత్రాలను తయారు చేసి బుధవారం వారికి అందజేశారు. ఈ సదుపాయం వల్ల కోర్టులో నిందితుల పక్షాన జమానత్ కోసం వినియోగించే డిపాజిట్ బాండ్లను ఇతర బ్యాంకుల్లో చేయించుకునే ప్రయాస తప్పిందని గడ్డం లక్ష్మణ్ తెలిపారు.

ఈ సదుపాయం కల్పించేందుకు సహకరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్‌తో పాటు ఇతరత్రా సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి శ్రీకాంత్, కోశాధికారి సుంకె దేవకిషన్, సీనియర్ న్యాయవాదులు కొరివి వేణుగోపాల్, గౌరు రాజిరెడ్డి, రాజు, సామ్యూల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>