కలం, సినిమా: టాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ సాధినేని మీడియాతో మూవీ ముచ్చట్లు షేర్ చేసుకున్నారు.
‘ఆకాశంలో ఒక తార’ కథను చాలా ఇష్టంగా రాసుకున్నట్లు పవన్ తెలిపారు. సినిమా కూడా అంతే అద్భుతంగా వచ్చిందన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనుసులో నవ్వు కనిపిస్తుందని చెప్పారు. ఒక అమ్మాయి తన కలను సాధించుకోవాలనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ఆ ప్రయాణంలో కృష్ణ ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు? ఆమె ప్రయాణం ఎలా ముందుకు సాగింది? అనే అంశాన్ని చాలా బ్యూటిఫుల్‌గా కథలో చెప్పామన్నారు. ఇది ఒక ఆశను చిగురింపజేసే కథ అని చెప్పారు. ప్రస్తుత సమాజంలో నెగెటివిటీ చాలా ఎక్కువైపోయిందని, ఈ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో కూడా కృష్ణ లాంటి క్యారెక్టర్ ఉంటే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు కచ్చితంగా కలుగుతుందని అన్నారు.
కృష్ణ పాత్రకు దుల్కర్ గారు 100 శాతం న్యాయం చేశారని, ఆయన ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని చెప్పారు. ఈ కథ కోసం హీరోయిన్ను వెతకడం అనేది మొదటి నుంచి తనకు పెద్ద ఛాలెంజ్‌గా ఉందని అన్నారు. ఇలాంటి సినిమాలకు ఆల్రెడీ పేరున్న హీరోయిన్ అయితే సేఫ్ ఆప్షన్ అయినా, కొత్త ముఖం అయితే బాగుంటుందని మొదటి నుంచి భావించామన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో సాత్విక రీల్స్ చూసి, ఆడిషన్ చేసి ఈ పాత్రకు ఎంపిక చేశామన్నారు. కథలో శ్రుతి హాసన్ పాత్ర చాలా కీలకమని, ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నింటిలో ఇది చాలా మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సినిమా యూనివర్సల్ కథ అని అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని సమ్మకంగా ఉన్నామన్నారు.

