కలం, బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పరిధిలోని రావినూతల (Ravinuthala) గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మోటమర్రి గ్రామానికి చెందిన కుమ్మెర నరసింహారావు (38) తీవ్రంగా గాయపడ్డాడు. చెట్లు నరికే పనికి వెళ్లిన నరసింహారావు చెట్టును పట్టుకుని సహాయం చేస్తుండగా, ప్రమాదవశాత్తు ట్రీ కట్టర్ యంత్రం వేగంగా తిరుగుతూ అతని ఎడమ చేతికి తగిలింది. దీంతో చేతికి తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది.
సమాచారం అందుకున్న బోనకల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ కోట భానుసహాన్, పైలట్ ఎం. మిథున్ చక్రవర్తి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి రక్తస్రావాన్ని అదుపు చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

