‘మహా’ రాజకీయాల్లో వివాదాస్పదంగా సోనియా గాంధీ ‘ఆత్మకథ’

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ పుస్తకం (Sonia Gandhi Book) మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. పుస్తకంలోని కొన్ని పేజీలపై శివసేన పార్టీ (Shiv Sena Party) తీవ్ర అభ్యన్తరం తెలిపింది. ఆమె రాసుకున్న ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌, మరాఠీ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు ముంబైలో బుధవారం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతలు పుస్తకంలోని 201, 443 పేజీలు చింపేసి నిరసన ప్రదర్శించారు.

శివసేన నేతలు సంజయ్ నిరూపమ్, పార్టీ జాతీయ కార్యదర్శి, అధికార ప్రతినిధి షైనా ఎన్.సి. ఆనంద్ దూబే తదితరులు పుస్తకంలోని పేజీలను చించివేసి తమ నిరసన తెలిపారు. పుస్తక (Sonia Gandhi Book) ప్రచురణకర్త హార్పర్‌కాలిన్స్ వెంటనే వివాదాస్పద భాగాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మహారాష్ట్రలో పుస్తక పంపిణీని నిలిపివేయాలని హెచ్చరించారు. మరాఠీ ప్రజల మనోభావాలను ఈ పుస్తకంలోని అంశాలు దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. వీర్ సావర్కర్ చేసిన త్యాగాలను విమర్శించే హక్కు సోనియా గాంధీకి ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

Also Read : సిద్దిపేటలో రాజకీయ వేడి.. హరీశ్ కంచుకోటపై గురి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>