జ‌గ‌న్ కేసులో ఈడీ మ‌రో చార్జ్‌షీట్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) అక్ర‌మాస్తుల కేసుల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ మ‌రో చార్జ్‌షీట్‌ దాఖ‌లు చేసింది. దాల్మియా సిమెంట్స్ కేసులో మ‌నీ ల్యాండ‌రింగ్ చ‌ట్టం ఉల్లంఘించిన‌ట్లు అభియోగాలు మోపింది. హైద‌రాబాద్ కోర్టులో ఈ చార్జ్‌షీట్‌ దాఖ‌లైంది. గ‌తంలోనే ఈ కేసులో జ‌గ‌న్, దాల్మియా కంపెనీల ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ చార్జ్‌షీట్‌పై సీఐడీ కోర్టు ప‌రిశీల‌న జ‌రుపుతోంది. ప‌దిహేనేళ్లుగా జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ జ‌రుగుతోంది. భార‌తి సిమెంట్స్ కేసుల్లో కూడా ఈడీ ఇత‌ర నిందితుల‌పై చార్జ్‌షీట్‌ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>