మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

కలం, ఖానాపూర్ : మహిళా సంఘాల బలోపేతం, కార్యకలాపాల నిర్వహణకు సొంత భవనాలు ఉపయోగపడతాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) అన్నారు. ఖానాపూర్ మండలంలోని ఎర్వ చింతల్, కొలంగూడ, బీర్నంది గ్రామాల్లో మహిళా సంఘాల (వీఓ) భవనాల (Womens VO Buildings) నిర్మాణ పనులకు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఈ భవనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>