కలం, నిర్మల్ : పెండింగ్ కేసుల (Pending Cases) దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలతో పాటు హత్యలు, ఆస్తి సంబంధిత నేరాల దర్యాప్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ-సాక్ష్య, సీసీటీఎన్ఎస్ 2.0, ఐసీజేఎస్ విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచాలని తెలిపారు. రాత్రి గస్తీ ముమ్మరం చేయడంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి సత్వర పరిష్కారం చూపాలన్నారు. అనంతరం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు వాహనాలను తనిఖీ చేసి, ఎల్లప్పుడూ విధులకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

