న్యూజిలాండ్ కోచ్‌గా ముంబై సిటీ మాజీ కోచ్!

కలం, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీకి లీగ్ షీల్డ్ అందించిన కోచ్ డెస్ బకింగ్‌హామ్‌ (Des Buckingham)కు మరో కీలక బాధ్యత దక్కింది. న్యూజిలాండ్ పురుషుల జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయన నియమితులయ్యారు. 2027 జూలై 1 నుంచి 2030 ఫిఫా ప్రపంచకప్ వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు. 41 ఏళ్ల బకింగ్‌హామ్ ప్రస్తుతం సౌదీ అరేబియా క్లబ్ అల్ ఖులూద్‌కు కోచ్‌గా ఉన్నారు. న్యూజిలాండ్ సీనియర్ జట్టుతో పాటు పురుషుల అండర్-23 జట్టుకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు యువ జట్టును సిద్ధం చేయడం ఆయన లక్ష్యం.

2021లో ముంబై సిటీ ఎఫ్‌సీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బకింగ్‌హామ్.. 2022-23 సీజన్‌లో జట్టుకు లీగ్ షీల్డ్ అందించారు. ఆ సీజన్‌లో ముంబై సిటీ 18 మ్యాచ్‌ల పాటు ఓటమి లేకుండా కొనసాగింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గతంలో న్యూజిలాండ్ జూనియర్ జట్లకు కూడా కోచ్‌గా పనిచేసిన అనుభవం బకింగ్‌హామ్‌కు ఉంది. 2019 అండర్-20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చారు. ఇప్పుడు సీనియర్ జట్టుతో పాటు యువ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>