వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపు, వారి సంక్షేమం పట్టని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణమే రాజీనామా చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని , కాలపరిమిత ముగిసిన ఏజెన్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్మికులు వినూత్నంగా నిరసన (Contract Workers Protest) తెలిపారు. అర్ధ నగ్నంగా ఊరేగింపు చేసి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు 90% పైగా దళితులు, గిరిజనలు, బలహీనవర్గాల కార్మికులే ఉన్నారని, ఇలాంటి సామాజిక వర్గాల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో ఏ దిక్కులేని పేదల ఆరోగ్యాలు పరిశుభ్రతకు, భద్రతకు వెలకట్టలేని సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కార్మికులకు జీతాలు పెరగలేదని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఏజెన్సీల వ్యవస్థను రద్దుచేసి కార్పొరేషన్ నెలకొల్పి కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గత ఆరు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు టోకెన్ సమ్మె చేస్తు సేవలో నిమగ్నం కావాల్సిన సిబ్బంది రోడ్లపై ఆకలి కేకలతో జీతాలు పెంచాలని అలమటిస్తున్న వైద్య శాఖ ఉన్నత అధికారులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే కార్మికులతో చర్చించి న్యాయం చేయాలని లేకపోతే కార్మికుల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు రంగయ్య, జె.నరసింహ, బి. చెన్నయ్య, బుచ్చన్న, భీమన్న, అంజలయ్య, గోపాల్ నాయక్, శ్రీనివాస్, గంగాధర్, యాదగిరి, రామస్వామి, అంజి, యాదయ్య, గోపాల్, లోకేష్, శ్రీను, నరేష్, రామకృష్ణ, బాలరాజ్, శంకర్, చిన్నయ్య, పద్మమ్మ, సత్యమ్మ, వెంకటమ్మ, చంద్రకళ, సరోజ, లక్ష్మమ్మ, మంజుల, జమున అరుణ, లక్ష్మి, సాయమ్మ, జ్యోతి, తిరుపతమ్మ, లక్ష్మి, ఇందిరా, అంజమ్మ, జంగమ్మ, మీనా, కవిత గాయత్రి, సంధ్య, పద్మ, అంజలి, శ్రీదేవి, స్వప్న, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>