కలం, ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను (Smart Ration Cards) పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని బుడగ జంగం, ఖురేషి, మాల, గోసంగి, వడ్డెర కమ్యూనిటీలకు చెందిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ఆయా కమ్యూనిటీల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో ఆయా వర్గాల ప్రజలకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

