ఆత్మగౌరవంతో జీవించేందుకు చేయూత పింఛన్లు ఆర్థిక అండ: వేముల వీరేశం

‎కలం, నకిరేకల్ : అర్హులైన పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గౌడ, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కెట్‌పల్లి మండలాల్లో నూతనంగా మంజూరైన ‘చేయూత’ పింఛన్ల (Cheyutha Pensions) మంజూరు ఉత్తర్వులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా మండలాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ఈ విడతలో నకిరేకల్ ( Nakrekal) నియోజకవర్గానికి మొత్తం 5,356 నూతన పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో కట్టంగూర్ మండలానికి 1,141, కేతేపల్లి మండలానికి 802, నకిరేకల్ మండలానికి 759 పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. చేయూత పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, నిరుపేద కుటుంబాలు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు కొండంత అండగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా, ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అర్హులైన వృద్ధులకు సైతం అతి త్వరలోనే నూతన పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయా మండలాల్లో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమాల్లో స్థానిక మండల అధికారులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>