తెలంగాణకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం.సందీప్ రాక!

కలం, వెబ్​ డెస్క్​: రాష్ట్రానికి కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇన్ చార్జ్​ బీఎం.సందీప్ (AICC In-Charge BM Sandeep) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 22న గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్వహించనున్న కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశానికి చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పీఏసీ సభ్యులు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు మధ్యాహ్నం నిర్వహించనున్న టీపీసీసీ (TPCC) విస్తృతస్తాయి సమవేశంలో పార్టీ ముఖ్యనేతలు, నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక 23వ తేదీన కూడా బీఎం.సందీప్ (BM Sandeep) హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నట్లు సమాచారం. కొత్త ఇన్​ చార్జ్​ తో సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు భేటీ కానున్నారు. కాగా, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, రాజకీయాలు, నేతల మధ్య అనైక్యతపై ఈ పర్యటనలో సందీప్​ చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : మేనిఫెస్టో ప్రతులను చించి, చెత్తబుట్టలో వేసి.. బీఆర్ఎస్ నిరసన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>