వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కలం, తలమడుగు: పేదల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. మంగళవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో నిర్వహించిన చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించారని పేర్కొన్నారు. గతంలో రూ. 200గా ఉన్న పింఛన్‌ను రూ.2,016కు పెంచి పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వృద్ధులు, బీడీ కార్మికులకు నూతన పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇందిరా కుటుంబ బీమా పథకం కింద పరిహారం అందించాలని కోరారు. ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో బీమా పరిహారానికి దూరమైన రైతు కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>