రూమ్ కోసం వెళ్తే ప్రాణాలు తీశారు.. భద్రాచలం లాడ్జిలో అసలేం జరిగింది?

​కలం, ఖమ్మం బ్యూరో: ప్రశాంతంగా ఉండే ఆధ్యాత్మిక పట్టణం భద్రాచలం (Bhadrachalam) లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం గది అద్దె కోసం లాడ్జి (Lodge) కి వెళ్లిన ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అసలు అర్ధరాత్రి వేళ ఆ లాడ్జిలో ఏం జరిగింది? చిన్నపాటి వాగ్వాదం ఒక యువకుడి ప్రాణాలు తీసేంత వరకు ఎందుకు వెళ్లింది? అన్నది ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

​అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామానికి చెందిన తెల్లం శరత్ (24) గది అద్దెకు తీసుకునేందుకు సోమవారం అర్ధరాత్రి భద్రాచలం పట్టణంలోని ఓ లాడ్జికి వెళ్లాడు. ఈ క్రమంలో గది కేటాయింపు లేదా అద్దె విషయమై శరత్‌కు, లాడ్జి సిబ్బందికి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చూస్తుండగానే ఈ వాగ్వాదం కాస్తా భౌతిక ఘర్షణకు దారితీసింది. దాడిలో శరత్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒక యువకుడు లాడ్జిలో విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

​సమాచారం అందుకున్న భద్రాచలం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు వివాదానికి మూలకారణం ఏంటి, దాడి చేసింది లాడ్జి సిబ్బందా? లేదా బయటి వ్యక్తులా, దాడిలో ఎంత మంది పాల్గొన్నారు అన్న కోణంలో విచారణ సాగుతోంది. శరత్ మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అధికారికంగా తేలనున్నాయని పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>