ప్రత్యేక బియ్యం అమ్మకపు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

కలం, నిర్మల్: ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో నిర్మల్ (Nirmal) పట్టణంలోని సోఫినగర్ రైస్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం అమ్మకపు కౌంటర్‌ (Special Rice Sales)ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రతి బస్తా 26 కిలోల ప్యాక్‌ రూపంలో విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన రిటైల్ ధరలకే బియ్యాన్ని విక్రయించాలని సూచించారు. అందుబాటులో ఉన్న రకాలను బట్టి కేజీకి బిపిటి / కెఎన్ఎం 66 రూపాయలు, ఆర్ఎన్ఆర్ / తెలంగాణ సోనా 74 రూపాయలు, హెచ్‌ఎమ్‌టి / జెఎస్‌ఆర్ 79 రూపాయల చొప్పున విక్రయాలు చేపట్టాలని తెలిపారు. ధరల పట్టికను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, ఇతర అధికారులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>