అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి: ఏలేటి

కలం, సోన్: పేద, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తున్నాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) అన్నారు. సోన్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు ఉత్తర్వులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన వారికి ఆసరా పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పింఛన్లతో లబ్ధిదారులకు నిత్యావసర ఖర్చుల విషయంలో కొంతమేర ఉపశమనం లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సరిగెల గంగన్న, హరీష్ రెడ్డి, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, సర్పంచులు రాజు రెడ్డి, సాగర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>