11 ఏళ్ల తర్వాత గ్రౌండ్లోకి దిగిన దిగ్గజం!

క‌లం, స్పోర్ట్స్: ఫుట్‌బాల్‌ అభిమానులకు మరోసారి తన ఆటను చూపించాడు బ్రెజిల్‌ దిగ్గజం రొనాల్డిన్హో (Ronaldinho). 46 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లోకి తిరిగి అడుగుపెట్టాడు. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఇటలీ క్లబ్‌ రావెన్నా తరఫున బరిలోకి దిగాడు. స్థానిక ప్రత్యర్థి ఫోర్లీతో జరిగిన మ్యాచ్‌లో రావెన్నా 2-0తో విజయం సాధించింది. 2015లో బ్రెజిల్‌ క్లబ్‌ ఫ్లూమినెన్స్‌ తరఫున చివరిసారిగా ప్రొఫెషనల్‌ మ్యాచ్‌ ఆడిన రొనాల్డిన్హో.. ఇప్పుడు మళ్లీ మైదానంలోకి వచ్చాడు. రావెన్నా తరఫున జెర్సీ నంబర్‌ 10తో బరిలోకి దిగాడు. తొలి అర్ధభాగం మొత్తం ఆడాడు. మ్యాచ్‌ 36వ నిమిషంలో రావెన్నా తొలి గోల్‌ చేసింది.

ఈ గోల్‌కు ముందు జరిగిన కదలికలో రొనాల్డిన్హో కీలకంగా వ్యవహరించాడు. అతడి నుంచి అందిన బంతిని లియోనార్డో లోనార్డి ముందుకు తీసుకెళ్లి.. గియులియో డొనాటికి అందించాడు. డొనాటి దాన్ని గోల్‌గా మలిచాడు. రెండో అర్ధభాగంలో సిమోన్‌ రబ్బీ మరో గోల్‌ చేయడంతో రావెన్నా 2-0తో గెలిచింది. మైదానంలోకి రొనాల్డిన్హో అడుగుపెట్టగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మళ్లీ ఆడతారా అని అడిగితే.. క్లబ్‌ అధ్యక్షుడు పిలిస్తే తిరిగి వస్తానని ఆయన చెప్పాడు. దీంతో రొనాల్డిన్హో మళ్లీ మైదానంలో కనిపిస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>