కలం, సోన్: సోన్ మండలం లోకల్ వెల్మల్ (Local Velmal) గ్రామంలో గుర్తుతెలియని దుండగులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని రాగి తీగను ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతులు వంజరి సుదర్శన్, చాకలి చిన్నయ్య, పిండి మల్లయ్య తమ వ్యవసాయ అవసరాల కోసం 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని రాగి తీగను అపహరించారు. సోమవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

