కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన పర్సనల్ లైఫ్‌లో ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. రాహుల్ గాంధీకి పెళ్లి అయిందని, ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు ఉన్నాయి. అయితే వీటిపై రాహుల్ ఏనాడూ పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా ఢిల్లీలో తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్_ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
తన తల్లిదండ్రులు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తొలిసారి కలుసుకున్న రెస్టారెంట్‌కు తాను కేంబ్రిడ్జ్‌లో చదువుకునే రోజుల్లో తన గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తన తల్లిదండ్రుల ప్రేమకథలో ప్రత్యేక స్థానం ఉన్న ఆ రెస్టారెంట్‌ను ఆమెకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే తన ప్రియురాలు ఎవరన్నది మాత్రం రాహుల్ బయటపెట్టలేదు. ఏదేమైనా ఐదు పదుల వయస్సులో తన గర్ల్ ఫ్రెండ్ గురించి రాహుల్ బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

