కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ సమీపంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం (Hardoi Accident) జరిగింది. ఓవర్‌స్పీడ్ కారణంగా అదుపు తప్పిన ఎస్‌యూవీ డివైడర్‌ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మృతులను బార్క్లేస్ సంస్థలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న సౌరభ్ ఉపాధ్యాయ్ (40), ఆయన భార్య మేనక (35), కుమారులు వ్యోమ్ (7), శివోమ్ (18 నెలలు)గా గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఈ కుటుంబం భాయ్ దూజ్, ఛఠ్ పూజ వేడుకల కోసం తమ స్వస్థలానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

