కృష్ణా జలాలపై సమర్థంగా వాదనలు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ నెల 18 తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, న్యాయ నిపుణులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ ఇంజినీర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని అందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించాలని సూచించారు. ఎక్కడ టన్నెల్, ఎక్కడ కాలువ అవసరమో గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలన్నారు.

అధికారులకు వార్నింగ్..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అదనపు టీఎంసీ పనుల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మొదట సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతో పాటు డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>